• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పుడు కండోమ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోలింగ్‌ సొసైటీ (ఎపి శాక్స్‌) బాక్సుల కొద్దీకండోమ్స్‌ను అన్ని జిల్లాల మెడికల్‌ ఆఫీసర్లకు పంపింది. నాలుగు లక్షల కండోమ్స్‌ను ఎలా పంపిణీ చేయాలో అర్ధం కాని అధికారులు కొత్త మార్గాల కోసం అన్వేషించి, చివరికి న్యూస్‌ పేపర్లకు వాటిని పిన్‌ చేసి పంపాలని నిర్ణయించారు. దినపత్రికలకు కండోమ్‌ను జత చేసి పంపడం ఒక్కటే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్టు నిజామాబాద్‌ జిల్లా న్యూక్లియస్‌ అధికారి డాక్టర్‌ దినేష్‌ చెప్పారు. ఎపి శాక్స్‌ నుంచి తమకు నాలుగు లక్షల కండోమ్స్‌ అందాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం నిజామాబాద్‌ పట్టణంలో ప్రయోగాత్మకంగా దినపత్రికల ద్వారా కండోమ్స్‌ సరఫరా చేస్తామని, ఈ పద్ధతి విజయవంతమైతే గ్రామాలకు కూడా విస్తరిస్తామన్నారు. కానీ పొద్దున్నే ఇంట్లోకి వచ్చి వాలే దినపత్రికలకు కండోమ్‌ను జత చేయడం వల్ల చిన్న పిల్లలు చూస్తే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు.

ఎన్టీఆర్‌ పడ్డాడండి ప్రేమలో మరి!
నటి నమితకు బెదిరింపు కాల్స్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X