వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ఒళ్ళు పెరిగిపోవడం, అవకాశాలు తరిగిపోవడంతో నమిత తన ఫ్రెండ్‌ భరత్‌తో కలిసి చెన్నైలో ఒక వ్యాపారం చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. అయితే ఆ క్రమంలో ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నమిత, భరత్‌ కలిసి ఒక సీనియర్‌ పోలీసు అధికారి ఆఫీసు వెలుపల కన్పించడంతో ఆమె పోలీసుల సహాయంతో భరత్‌ను పెళ్ళాడడానికి అక్కడికి వచ్చిందని ఆమెను గుర్తుపట్టిన వారు భావించారు. కానీ ఆ వార్తలను నమిత ఖండించింది. ఒక వ్యాపారం ప్రారంభించడానికి చెన్నైలో ఒక చోట ఒక స్ధలాన్ని కొనుగోలు చేశానని, అయితే స్ధానిక గూండాలు తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, డబ్బు అడుగుతున్నారని నమిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పనిలో భాగంగానే ఒక సీనియర్‌ పోలీసు అధికారిని కలిసినట్టు ఆమె వెల్లడించింది. బెదిరింపు కాల్స్‌ తన వెర్రి అభిమానుల నుంచి వచ్చి ఉంటాయని మొదట అనుకున్నానని, ఆ తర్వాత ఆ కాల్స్‌లో ఉన్న సీరియస్‌నెస్‌ను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశానని నమిత చెబుతోంది. ఇంతకీ ఆమె భరత్‌తో కలిసి చేయబోయే వ్యాపారమేమిటి? అది ఇప్పటికీ రహస్యమే. ఆ విషయం తెలుసుకోవడం నన్‌ ఆఫ్‌ అవర్‌ బిజినెస్‌ ఏమో!

ఎన్టీఆర్‌ పడ్డాడండి ప్రేమలో మరి!
న్యూస్‌పేపరుతో కండోమ్‌ ఉచితం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X