హోంపేజి
ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న సంగతి తెలిసిందే. మహిళల స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని చెప్పుకునే సిపిఎం నాయకుల సమక్షంలోనే ఒక మహిళ తాను శీలవతిని అని నిరూపించుకోడాని అగ్నిపరీక్ష జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన 28 ఏళ్ళ సముద్రాలు అనే వివాహిత దాదాపు 300 మంది గ్రామస్ధుల సమక్షంలో ఎర్రగా కాల్చిన ఇనుపపడ్డీని పట్టుకుని తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవలసి వచ్చింది. సముద్రాలు పదేళ్ళ క్రితం బాబు అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. మొదట పుట్టిన మగపిల్లాడు అవిటివాడు. ఆ తర్వాత మళీ మగపిల్లాడు పుడతాడని ఆశిస్తుండగానే ఆమె వరుసగా ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇలా ఉండగా ఆమె శీలం మీద భర్తకు అనుమానం వ చ్చింది. నిజానిజాలు తాను స్వయంగా తెలుసుకోకుండానే అతను భార్య మీద గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆమె శీల పరీక్షకు రంగం సిద్ధమైంది. మున్నేరు ఒడ్డున దాదాపు క్వింటాల్ కట్టెలతో ఒక పెద్ద ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి సిద్ధం చేశారు. సముద్రాలు మున్నేరులో స్నానం చేసి, తడి బట్టలతో ఆ ఇనుప కడ్డీని పట్టుకోవాలి. చేతులు కాలితే ఆమె పతిత కింద లెక్క. కానీ ఆమె చేతులు కాలలేదు. దానితో గ్రామ పెద్దలు ఆమెను పతివ్రతగా ధృవీకరించారు.
నయనతార ఓవరాక్షన్
చంద్రబాబుకు దేవెందర్ గౌడ్ భయం