• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీనటి శోభన ప్రస్తుతం కేరళలో నృత్య పాఠశాల నడుపుకుంటోంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి అవార్డులు పొందిన ఆమె ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. భరతనాట్యంపై ఆమెకు ఉన్న ప్రేమ అంతాఇంతా కాదు. నారీ నారీ నడుమ మురారి, రౌడీగారి పెళ్ళాం వంటి కమర్షియల్‌ చిత్రాల్లో కన్పించినా, రుద్రవీణ వంటి క్లాసిక్‌ చిత్రంలో నటించినా ఆమెదొక సొంత బాణి.

Actress Shobhanaదక్షిణాది భాషలన్నిటిలో నటించినా ఆమె ప్రతిభను వెలుగులోకి తెచ్చింది మలయాళ సినిమా రంగమే. విశాల నేత్రాలు, చక్కటి అంగసౌష్టవం గల శోభనను పెళ్ళి చేసుకోడానికి ఎందరో సినీ జీవులు ముందుకు వచ్చినా ఆమె సింపుల్‌గా నో అని చెప్పేసింది. ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లాగా పురుషద్వేషి అన్న అభిప్రాయం కూడా ఉంది. తమిళ పత్రికలు ఈ విషయాన్ని అనేకసార్లు రాశాయి. శోభన చుట్టూ ఎప్పుడూ మహిళలే ఉంటారని దక్షిణాది సినీజీవులందరికీ తెలుసు. ఇటీవల ఆమె మోహన్‌బాబు గేమ్‌లో నటించింది. ఆమె లెస్బియన్‌ అని ఆరోపణలు వచ్చాయి. సంప్రదాయ నృత్య కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు పురుషధ్వేషం ఎందుకు ఏర్పడిందో తెలియక సినీజీవులు తలలు పట్టుకుంటున్నారు.

శోభారాజ్‌తో తగాదాయే మాడుగులను ముంచిందా?
ఎన్నారై మధు యాష్కి అతితెలివి రాజకీయం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X