హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ నగరంలో ఇప్పుడు ప్రతి ఆరుగురిలో ఒకరు రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌లో ఉన్నట్టు ఒక అంచనా. ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నవారు కూడా పార్ట్‌టైమ్‌గా రియల్‌ఎస్టేట్‌ మార్కెటింగ్‌ చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. నగరంలో రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ తారాస్ధాయికి చేరడంతో సాఫ్ట్‌వేర్‌ నిపుణులు కూడా టెలీ మార్కెటింగ్‌ ద్వారా బంధు మిత్రులను వెంచర్లలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు. అత్యంత పలుకుబడి కలిగిన పోలీసు ఉద్యోగాలను కూడా వదులుకుని రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి కొందరు అడుగు పెట్టారు. టాస్క్‌ఫోర్స్‌ సిఐగా పనిచేస్తున్న ధనుంజయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ వ్యాపారంలో తనకు తానే బాస్‌నని, పోలీసు ఉద్యోగంలో కంటే ఎక్కువగా సంపాదిస్తున్నానని అయన చెబుతున్నారు. సస్పెండ్‌ అయిన పోలీసు సిబ్బంది కూడా తమ సమయాన్ని రియల్‌ఎస్టేట్‌ రంగంపై వెచ్చించి డబ్బు గడిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ మరో రెండేళ్ళ పాటు ఉండవచ్చని నిపుణుల అంచనా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X