చెంపదెబ్బలు తినలేదంటున్న రవితేజ
రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఓటర్లు రాష్ట్ర రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపుతున్నారు. ఈ రహస్యం చంద్రబాబు నాయుడి కంటే వైఎస్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన ఇరవై ఏళ్ళపాటు కాంగ్రెస్‌లో అసమ్మతి వాదిగా కొనసాగినా కాపు నాయకులను తన శిష్యులుగా చేసుకున్నారు. వంగవీటి మోహన్‌రంగా నుంచి అంబటి రాంబాబు వరకు అయన శిష్యులే. కాపు దాని అనుబంధ కులాల మద్దతు లేకుండా ఈ పాతికేళ్ళలో ఏ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు కాపునాడులో విభేదాలు రాజశేఖరరెడ్డి శిబిరానికి ఆందోళన కలిగిస్తుండగా చంద్రబాబును ఆనందపరుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వృద్ధ కాపు నాయకులను మినహా యువతరాన్ని ప్రోత్సహించలేదు. ఆయన పోలిట్‌బ్యూరోలో కూడా దేవేందర్‌గౌడ్, యనమల రామకృష్ణుడు వంటి బిసి నాయకులకే ప్రాధాన్యం ఉంది. ఈ నేపధ్యంలో బిసిలను కాకుండా కాపులనే నమ్ముకున్న రాజశేఖరరెడ్డి శిబిరం కాపు నాడు నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి తమ పడవను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు.
విజయశాంతి- నరేంద్ర- ఏమిటీ నాటకం?