• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|

స్వతహాగా పురోహితుడైన ఐరన్‌లెగ్‌ శాస్త్రి సినిమా రంగానికి రావడం ఒక యాక్సిడెంట్‌. స్వధర్మాన్ని మానుకుని ఆయన హాస్యనటుడిగా సినిమా రంగానికి వచ్చారు. ప్రేక్షకులకు హాస్యాన్ని పంచి తను మాత్రం ఈ ఇరవై ఏళ్ళు విషాదాన్ని తన పెద్ద కడుపులో దాచుకున్నారు. మంచి నటనా సామర్ధ్యం ఉన్నా ఆయన ఐరన్‌లెగ్‌గా స్ధిరపడిపోవడంతో ఆయన నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఆయన సన్నిహితులే వాడిది ఐరన్‌ లెగ్‌, వాడికి పాత్ర ఇవ్వొద్దు అంటూ అడ్డుపడ్డారు. అతనిది నిజంగా ఐరన్‌ లెగ్‌ అయితే ఆయన నటించిన అన్ని సినిమాలు హిట్‌ అయి ఉండేవా? అదే ఆవేదనతో శాస్త్రి బాధ పడేవాడు. చివరికి తనువు చాలించాడు. కింద పడిపోయిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కాలితో తన్ను కుంటూ పోవడం మన తెలుగు సినిమా పరిశ్రమ సహజ లక్షణం. ఒక్క పూట భోజనానికి డబ్బు ఇవ్వమని అడిగినా మొహం చాటేసిన వ్యక్తులు ఇప్పుడు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరుగాక.

చిరంజీవి- కులరాజకీయాలు

చిరంజీవి రాజకీయాల్లోకి రావాలంటూ రాష్ట్ర కాపు, తెలగ, బలిజ సదస్సు ఆదివారం అభిప్రాయపడడంతో చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై మళ్ళీ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ సదస్సుకు చిరంజీవి సోదరుడు నాగబాబు హాజరయ్యారు. ఈ సదస్సులో కాపుల సమస్యలు ప్రస్తావించవచ్చని, కానీ చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని మాత్రం ఎవరూ మాట్లాడకూడదని ముందే షరతు విధించినా కాపు, బలిజ నాయకులు చిరంజీవి మీదనే దృష్టి కేంద్రీకరించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే 2009 నాటికి ఆయనే ముఖ్యమంత్రి అవుతారని కాపు నాయకులు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. అన్నయ్యను రాజకీయాల్లోకి రమ్మని కోరి ఇబ్బంది పెట్టవద్దు అని నాగబాబు కోరినా కాపు సదస్సు ఆ దిశగానే పయనించింది. గత ఎన్నికల్లో చిరంజీవి పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. అది ఆయన కులస్తులకు, అభిమానులకు నచ్చలేదు. అప్పటి నుంచి చిరంజీవి టిడిపి అధినేతతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

బాలకృష్ణ కోసం బాబు ఆరాటం

మీడియా సహాయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎంతగా దాడి చేసినా ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఉండడంతో టిడిపిని గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు మాస్టర్‌ ప్లాన్‌ కోసం అన్వేషిస్తున్నారు. టిడిపి విశాలాంధ్రకు క ట్టుబడి ఉండడం దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరి వంటి నాయకులకు రుచించకపోయినా వారు తెలంగాణ ప్రజల నాడిని గట్టిగా పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. హరికృష్ణను పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు హీరో బాలకృష్ణ సహకారం కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తన కెరియర్‌ మీదనే దృష్టి సారించిన బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున బహిరంగంగా బయటకు రావడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more