• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ఈసారి చిరంజీవి జన్మదినోత్సవాన్ని వినూత్నంగా జరపాలని ఆయన శ్రేయోభిలాషులు ప్లాన్‌ చేస్తున్నారు. అభిమానుల తాకిడి తట్టుకోలేక ప్రతి ఏడాది తన జన్మదినం రోజున హైదరాబాద్‌లో ఉండడం లేదని ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాచారాన్ని పంపే చిరంజీవి ఈసారి మాత్రం హైదరాబాద్‌లో తప్పనిసరిగా ఉంటారు. ఆగస్టు 21 రాత్రి హైదరాబాద్‌ శిల్పకళావేదికలో అత్యంత ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు జరుగనున్నాయి. చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఆయన జన్మదిన వారోత్సవాలు జరుగనున్నాయి. మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. చర్లపల్లి ఇండ్రస్టియల్‌ ఏరియాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు ఆగస్టు 15న ప్రారంభిస్తారు. అక్కడ మొత్తం 10 వేల మొక్కలను చిరంజీవి అభిమానులు నాటుతారు. చిరంజీవి జన్మదినోత్సవంలోనే ఆయన తాజా చిత్రం స్టాలిన్‌ ఆడియో విడుదల అవుతుంది. ప్రతి పుట్టినరోజున అభిమానులకు తాకిడికి దూరంగా ఉండే చిరంజీవి ఈసారి వేలాది మంది సమక్షంలో జరుపుకోడానికి కారణమేమిటి? రాజకీయ రంగ ప్రవేశానికి ఇది పూర్వ రంగమా?

ఎవరీ ముళ్ళపూడి రేణుక?
హిందీ సినిమాలో నటిస్తున్న గద్దె సింధూర

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X