• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Sridhar L
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎంత సరదాగా ఉంటారో అంత సీరియస్‌ మనిషి. నిత్యం ఆయన పెట్టే ప్రెస్‌ మీట్లకు హాజరయ్యే మీడియా ప్రతినిధులను ఆయన లైట్‌గా తీసుకుంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో నకిలీ జర్నలిస్టులు కూడా బాగా బతికేవారు. మీడియా అంటే బాబుకు ఉన్న బలహీనత దానికి కారణం. కానీ రాజశేఖరరెడ్డి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు. గతంలో ముఖ్యమంత్రులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు బిల్డప్‌ ఇచ్చే ఒక వృద్ధ జర్నలిస్టుకు వైఎస్‌ తగిన విధంగా గుణపాఠం చెప్పినట్టు ఆలస్యంగా తెలియవచ్చింది. రాయలసీమకు చెందిన ఈ మైనారిటీ జర్నలిస్టు తనకు న్యూస్‌ ఏజెన్సీ ఉందని, తాను పంపితేనే స్ధానిక, జాతీయ పత్రికల్లో వార్తలు వస్తాయని చెప్పుకుని మంత్రులను నమ్మించేవాడు. ఎంత పెద్ద నాయకుడినైనా గారు, మీరు, సార్‌ అనకుండా పేరుతో పిలవడం ఇతని ప్రత్యేకత. దానితో ఇతను నిజంగా చాలా పెద్ద జర్నలిస్టు అని రాజకీయ నాయకులు భావించేవారు. ఇటీవల వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కూడా అతను అదే తరహాలో సంబోధించడంతో సిఎం ఖంగుతిన్నారు. ఇతనెవరో తెలుసుకోమని ఆయన ఇంటిలిజెన్స్‌ అధికారులను ఆదేశించడంతో అతనొక చోటా అని తేలింది. రెండు రోజుల తర్వాత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అతని ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి ముందు ఇక మీదట కనిపిస్తే బాగుండదని వార్నింగ్‌ ఇచ్చివచ్చినట్టు తెలిసింది. దానితో ఆ సోకాల్డ్‌ జర్నలిస్టు సచివాలయానికి, అసెంబ్లీకి వెళ్ళకుండా కాలం గడుపుతున్నట్టు సమాచారం.

కూరగాయల మాదిరిగా బ్లూఫిల్మ్‌ సీడీలు
చంద్రశేఖరరావుకు ఫికర్‌ గన్యా!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X