వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి జెసి దివాకరరెడ్డికి తాను చాలా ఛమత్కారంగా మాట్లాడుతానని గట్టి నమ్మకం. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఆయన అనేక సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత రాష్ట్రంగా చేయాలని ఆయన అనేక సార్లు వ్యక్తిగతంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కేంద్ర మంత్రులు చంద్రశేఖరరావు, నరేంద్ర రాజీనామా చేసినప్పుడు దివాకరరెడ్డి ఒక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. కెసిఆర్‌తో చర్చలు జరిపేటప్పుడు హైదరాబాద్‌ హోదా గురించి ప్రస్తావించమని అధిష్టానవర్గానికి తామే సూచించామని, అదే బ్రహ్మాస్త్రంలా పనిచేసిందని దివాకరరెడ్డి చెబుతున్నారు. కొన్ని వందల లారీలు, బస్సులు కల జెసికి హైదరాబాద్‌ నగరమంటే భలే ఇష్టం. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుయుక్తులు చెప్పడంలో ఆయన దిట్ట అని పేరుంది. తెలంగాణ అంశం మీద వైఎస్‌ ఆచితూచి మాట్లాడుతుండగా జెసి నోరు జారి మాట్లాడడం తగదని వైఎస్‌ శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగానో, ప్రత్యేక రాష్ట్రం గానో ప్రకటించాలని ఆంధ్ర, రాయలసీమలకు చెందిన నాయకులు ఎప్పటి నుంచో జనాంతికంగా కోరుతున్నారు.

సినీతారల ఎస్టేట్‌ సంగతులు
ఉగాది సీజన్‌లో రజనీకాంత్‌ శివాజీ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X