వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇప్పుడు దక్షిణాదిలో నిర్మాణంలో ఉన్న అతిపెద్ద సినిమా రజనీకాంత్‌ శివాజీ. ఈ సినిమాకు స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథాంశం గురించి బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు నలభై కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 15 నెలల పాటు షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా తమిళ సంవత్సరాది అయిన 2007 ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. నాలుగు దక్షిణాది భాషలు కలిపి ఈ సినిమా యాభై కోట్ల బిజినెస్‌ చేయగలదని అంచనా. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఏడాది పాటు బల్క్‌ డేట్స్‌ ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. రజనీకాంత్‌- శంకర్‌ల సినిమా కాబట్టి శ్రీయ బల్క్‌డేట్స్‌ ఇచ్చి ప్రస్తుతం ఆ షూటింగ్‌లోనే తల మునకలై ఉంది. రజనీకాంత్‌- నయనతార నటించిన చంద్రముఖి తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌కు రాష్ట్ర హోదా కోసం లాబీయింగ్‌?
సినీతారల ఎస్టేట్‌ సంగతులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X