• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోంపేజి

By Staff
|

ప్రకాష్‌రాజ్‌తో స్పర్ధలు వచ్చి అతడిని తన సినిమాలకు చాలాకాలం దూరంగా ఉంచిన చిరంజీవి కొంచెం తగ్గి స్టాలిన్‌లో ఆయనను విలన్‌గా అంగీకరించారు. షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం, ఆలస్యానికి కారణాలను పిచ్చి జోకులుగా చెప్పడం వల్ల చిరంజీవి గతంలో ఆగ్రహంగా ఉండేవారు. అయితే మంచి టాలెంట్‌ ఉన్న ప్రకాష్‌రాజ్‌ని దూరం చేసుకోవడం వల్ల నిర్మాతలు, హీరోలే నష్టపోయారు. చిరంజీవి వల్ల నష్టపోయిన ఉదయ్‌కిరణ్‌తో తమిళంలో ప్రకాష్‌రాజ్‌ సినిమా తీయడం కూడా చిరు ఆగ్రహానికి గురైనట్టు చెబుతున్నారు. చిరంజీవికి ఎక్కడ కోపం వస్తుందోనని ప్రకాష్‌రాజ్‌ని దూరంగా ఉంచిన నిర్మాతలకు ఇప్పుడు వారిద్దరూ ఏకం కావడం వల్ల కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. స్టాలిన్‌ దర్శకుడు మురుగదాస్‌ చిరంజీవికి, ప్రకాష్‌రాజ్‌కి మధ్య రాజీ చేసినట్టు తెలుస్తోంది. అయితే స్టాలిన్‌లో విలన్‌గా నటించిన ప్రకాష్‌ రాజ్‌ పాత్ర పండలేదు. ఆ పాత్రను మరింత భీకరంగా చిత్రీకరించి ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేది. ప్రకాష్‌రాజ్‌ ఫార్ములా కూడా పనిచేయని నేపధ్యంలో చిరంజీవి- ప్రకాష్‌రాజ్‌ల మధ్య రాజీ కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిరు కుమారుడి పేరు మార్చుతారా?
వైఎస్‌పై వివిధ కులాల అసంతృప్తి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X