వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్యాణ్‌ భార్య హేమ

By Sridhar L
|
Google Oneindia TeluguNews

సినిమా రంగంలో మోసాలు, అతి వినయాలు, అబద్ధాలు మామూలే. అయితే దొంగతనాలు అరుదు. వర్ధమాన నృత్య దర్శకుడు కళ్యాణ్‌ భార్య హేమ తనకు పరిచయస్ధులైన వారి ఇంట్లో క్రెడిట్‌ కార్డు చోరీ చేసి, దాని మీద 80 వేల రూపాయల బంగారం కొనుగోలు చేసి పోలీసులకు దొరికిపోయింది. దర్శకుడు విష్ణువర్ధన్‌ (తెలుగులో కలిసుంటే ఫేం)కు కళ్యాణ్‌ సన్నిహిత మిత్రుడు. కళ్యాణ్‌, ఆయన భార్య హేమ విష్ణవర్ధన్‌ ఫ్లాట్‌కు తరచు వెళ్తుంటారు.

ఈ క్రమంలో ఒకరోజు హేమ ఆయన ఫ్లాట్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటీరియర్‌ డెకరేషన్‌ జరుగుతోంది. ఆర్కిటెక్ట్‌ సరోజిని డెకరేషన్‌ పనులను ముగించుకుని వెళ్తూ అక్కడే క్రెడిట్‌ కార్డును బయటికి తీసి మర్చిపోయింది. లాఘవంగా ఆ కార్డును కొట్టేసిన హేమ సరాసరి ఒక జ్యుయలరీ షాప్‌కి వెళ్ళి ఏకంగా ఎనభై వేల రూపాయల విలువైన నగలు కొనుగోలు చేసింది. మరునాడు సరోజినికి బ్యాంకు నుంచి ఒక కాల్‌ వచ్చింది. మీ కార్డు మీద పెద్ద మొత్తం డెబిట్‌ అయిందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు సరోజిని ఫిర్యాదు చేయగా, హేమను వారు సునాయాసంగా పట్టుకోగలిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X