వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు శివారులోఉన్న కాణిపాకం సిద్ధి వినాయక ఆలయాన్నిసందర్శించిన తర్వాత చాలా మందిముఖ్యమంత్రులు పదవులు కోల్పోయారన్న సెంటిమెంట్‌ ఉంది.చిత్తూరు పట్టణాన్ని సందర్శించిన వెంటనేఎం. చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, చంద్రబాబునాయుడు పదవులు కోల్పోయారు. అధికారంలోకి వచ్చినతర్వాత ఐదుసార్లు చిత్తూరు జిల్లాలోపర్యటించిన ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి చిత్తూరు పట్టణాన్ని,కాణిపాకం ఆలయాన్ని సందర్శించకుండాజాగ్రత్త పడ్డారు. చిత్తూరులో నగరబాటకార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నాఆయన చివరి నిముషంలో రద్దుచేసుకున్నారు. కాణిపాకం వినాయకుడుమోసం, పాపం చేసినవాళ్ళనిక్షమించడని, వెంటనే శిక్షిస్తాడని ప్రతీతి.

వైఎస్‌పైనేదురుమళ్ళీ!

వైఎస్‌రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డిబద్ధ విరోధులు. వైఎస్‌ ముఖ్యమంత్రి కాకుండాఆయన అడ్డుకునే వారే కానీ అప్పటిరాజకీయ పరిస్ధితుల వల్ల కామ్‌గాఉండిపోయారు. నేదురుమల్లిజనార్ధనరెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకగ్రూపు ఉంది. అధిష్టానవర్గం వద్ద కూడాఆయనకు పలుకుబడి ఉంది. అందువల్లపెద్దాయనను వైఎస్‌ తక్కువగాఅంచనా వేయడం లేదు. వైఎస్‌రాజశేఖరరెడ్డిలో పోరాట పటిమతగ్గిందని, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకుతరలిపోతునాయని శుక్రవారంవైజాగ్‌లో వ్యాఖ్యానించి ఆయన సంచలనంసృష్టించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్‌పైఅసమ్మతికి జనార్ధనరెడ్డి నాందిపలికారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైజాగ్‌లో తగ్గినప్లాట్ల వేలం వెర్రి

వోక్స్‌వ్యాగన్‌ప్రాజెక్టు ఫార్స్‌ వ్యాగన్‌గా మారడంతోవిశాఖపట్నంలో రియల్‌ ఎస్టేట్‌ ధరలుతగ్గిపోయాయి. కార్ల ఫ్యాక్టరీ సైట్‌ చుట్టూఒకప్పుడు ఐదు లక్షలకు ఎకరం స్ధలం దొరికేది. వోక్స్‌వ్యాగన్‌పుణ్యమాని అదిపదిరెట్లు అంటే యాభైలక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఈఫ్యాక్టరీ రాదనితెలిశాక ధరలు సగానికి సగంపడిపోయాయి. ఇదంతా వేలం వెర్రి అని, నిజమైన అభివృద్ధిలేకుండా రియల్‌ఎస్టేట్‌ ధరలు ఎలా పెరుగుతాయనిరియల్టర్లు అంటున్నారు. వైజాగ్‌ వంటిచిన్న నగరాలకు అనేక పరిమితులుఉంటాయని, బెంగుళూరు, హైదరాబాద్‌నగరాలతో పోల్చుకోడానికి వీల్లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర రాజధానివైజాగ్‌ అవుతుందన్న అభిప్రాయం వల్లకూడా ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X