హోంపేజి
వైఎస్రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డిబద్ధ విరోధులు. వైఎస్ ముఖ్యమంత్రి కాకుండాఆయన అడ్డుకునే వారే కానీ అప్పటిరాజకీయ పరిస్ధితుల వల్ల కామ్గాఉండిపోయారు. నేదురుమల్లిజనార్ధనరెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్లో ఒకగ్రూపు ఉంది. అధిష్టానవర్గం వద్ద కూడాఆయనకు పలుకుబడి ఉంది. అందువల్లపెద్దాయనను వైఎస్ తక్కువగాఅంచనా వేయడం లేదు. వైఎస్రాజశేఖరరెడ్డిలో పోరాట పటిమతగ్గిందని, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకుతరలిపోతునాయని శుక్రవారంవైజాగ్లో వ్యాఖ్యానించి ఆయన సంచలనంసృష్టించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్పైఅసమ్మతికి జనార్ధనరెడ్డి నాందిపలికారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైజాగ్లో తగ్గినప్లాట్ల వేలం వెర్రి
వోక్స్వ్యాగన్ప్రాజెక్టు ఫార్స్ వ్యాగన్గా మారడంతోవిశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ ధరలుతగ్గిపోయాయి. కార్ల ఫ్యాక్టరీ సైట్ చుట్టూఒకప్పుడు ఐదు లక్షలకు ఎకరం స్ధలం దొరికేది. వోక్స్వ్యాగన్పుణ్యమాని అదిపదిరెట్లు అంటే యాభైలక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఈఫ్యాక్టరీ రాదనితెలిశాక ధరలు సగానికి సగంపడిపోయాయి. ఇదంతా వేలం వెర్రి అని, నిజమైన అభివృద్ధిలేకుండా రియల్ఎస్టేట్ ధరలు ఎలా పెరుగుతాయనిరియల్టర్లు అంటున్నారు. వైజాగ్ వంటిచిన్న నగరాలకు అనేక పరిమితులుఉంటాయని, బెంగుళూరు, హైదరాబాద్నగరాలతో పోల్చుకోడానికి వీల్లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర రాజధానివైజాగ్ అవుతుందన్న అభిప్రాయం వల్లకూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!