వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చానళ్ళా? చేపల చెరువులా?

By Staff
|
Google Oneindia TeluguNews

TV Channel
చేపల చెరువుల్లా వచ్చిన చానల్స్ ఇప్పుడు బావురుమంటున్నాయి. ఆదాయం తక్కువై, వ్యయం ఎక్కువై ఉగాది పంచాంగం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ టీవీ చానల్స్ కు నవరత్నాల యాడ్స్, ఆంజనేయ స్వామి యాడ్స్ పెద్ద దిక్కుగా మిగిలాయి. అంతకు ముందు ఇటువంటి చౌకబారు యాడ్స్ జోలికి పోని ఈటీవీ-2 కూడా అదే బాట పట్టింది. మిగితా న్యూస్ చానల్స్ ఆ యాడ్స్ ను ప్రేక్షకులకు విసుగుపుట్టే విధంగా పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఉన్న చానల్స్ కే యాడ్స్ లేకపోతే మరో అర డజను చానళ్ళు రెడీగా ఉన్నాయి.

ఒక టీవీ న్యూస్ చానల్ బతకాలంటే ఏం చేయాలి? యాడ్స్ సరిపడినన్ని వస్తాయా? న్యూస్ చానల్ కు ఎంటర్ టైన్ మెంట్ చానల్ కు వచ్చిననన్ని యాడ్స్ రావు. మరి ఈ విషయం తెలిసికూడా ఎందుకింత ఎగబడి చానల్స్ పెడుతున్నారు. అక్కడే మతలబు ఉంది. కాస్త నష్టం భరించినా ప్రభుత్వం నుంచి ఏదో ఒక లాభం పొందలేకపోతామా అన్న ఉద్దేశంతో నష్టాన్ని భరించడానికి వీరు ముందుకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ గేమ్ లో టీవీ జర్నలిస్టులు సమిధలవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X