హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు శాఖలో కులాల కుమ్ములాట!

By Staff
|
Google Oneindia TeluguNews

SSP Yadav
ఒకరు ఉత్తరాది యాదవుడు.మరొకరు తెలుగు బ్రాహ్మణుడు. ఒకరు డిజిపి, మరొకరు అడిషినల్ డిజిపి. ఇద్దరు పోలీసు బాస్‌ల మధ్య ఆధిపత్య పోరు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసింది. రాష్ట్ర పోలీసు బాస్‌ శ్యాంసుందర్‌ ప్రసాద్‌ యాదవ్‌ నిఘా అధిపతి అరవిందరావు వ్యవహారం కొరకరాని కొయ్యగా మారింది. వీరి ఆధిపత్య పోరు వెరసి చివరకు ఒకరు అవునంటే మరొకరు కాదనే స్థితికి వచ్చింది. ఒక అధికారి డిజిపి మనిషంటే ఈయన పట్టించుకోడు...నిఘా బాస్‌ మనిషంటే డిజిపి వేధించుకు తింటాడు. ఈ స్థితిలో పవర్‌ఫుల్‌ ఐపిఎస్‌ అధికారులు సైతం అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. 2004 మే లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌ గా అరవిందరావును వై.ఎస్‌.నియమించారు. ఆ తర్వాత అనునిత్యం నిఘా సమాచారాన్ని సీఎంకు ఉద యమే వివరించడం ఆనవాయితీ. దీంతో ముఖ్యమంత్రి వద్ద అరవిందరావుకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. అయితే రాష్ట్ర డీజీపీ ఎస్‌ఎస్‌పి యాదవ్‌ నియామకం జరిగిన తరువాత ఆయన పోలీసు వ్యవహారాలను పరిశీలించారు. అరవిందరావు ముఖ్యమంత్రికి సమాచారాన్ని ఇవ్వడం యాదవ ఓర్చుకోలేకపోయినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో అరవిందరావు, డిజిపి యాదవ్‌ల మధ్య విబేధాలు వెలుగుచూశాయి.

ఈ సమయంలో ఆక్టోపస్‌ డిజిపిగా వచ్చిన మహంతి ఎస్‌ ఎస్‌పి యాదవ్‌ వ్యవహారశైలి నచ్చక తీవ్రంగా వ్యతిరేకించే వారు. ఈ సమయంలో అరవిందరావు, యాదవ్‌ ఇద్దరు కలిసి మహంతిని ఆక్టోపస్‌ నుంచి తప్పించేందుకు తమదైన శైలిలో చక్రం తిప్పారు. అప్పటి వరకు విబేధాలున్నప్పటికీ, బయట పడకుండా నిఘాబాస్‌ - పోలీసు బాస్‌ లు వ్యవహరించేవారు. అనంతరం యాదవ్‌ సైతం అరవిందరావుపై అనుమానాలు రోజు రోజుకూ పెంచుకోవడం ఎక్కువయింది. మీడియాలో వ్యతిరేక కథనాలతో పాటు ముఖ్యమంత్రి వద్ద తనకు వ్యతి రేకంగా అరవిందరావు మినహా ఎవరూ చెప్పలేరనే అపోహతో ఆయనను విమర్శించే స్థాయికి వచ్చినట్లు పోలీసులు చెబు తారు. అదే విధంగా ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా అరవిందరావు డిజిపి ఛాంబర్‌కు వెళ్తే అనుమతి లేకుండా ఎలా వచ్చావని ప్రశ్నించిన సంఘటనలు కూడా జరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం డిజిపి, అరవిందరావు మధ్య అంతరం పెరిగిపోయింది.

ముఖ్యంగా ఈ యేడాది ప్రథమార్థంలో ఎసిబి డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఆర్‌.ఆర్‌.గిరీశ్‌కుమార్‌ ఇంటెలి జెన్స్‌ బాస్‌ దగ్గరి బంధువులు. జనవరి మాసంలో గిరీశ్‌కు మార్‌కు డిజిపిగా పదోన్నతి లభించాల్సి ఉంది. ఈ క్రమంలో సౌమ్యుడిగా పేరుగాంచిన గిరీశ్‌కుమార్‌ను డిజిపి చేయాలని అరవిందరావు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి యాదవ్‌ వర్సెస్‌ అరవిందరావుగా రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో డిజిపి యాదవ్‌ పదోన్నతుల వ్యవహారం లో అడ్డుకట్ట వేస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇదే సమయంలో అరవిందరావుకు వ్యతిరేకంగా ఐపిఎస్‌ అధికారి సుందర్‌కుమార్‌ దాస్‌తో సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే స్థాయి వరకు వీరి మధ్య కుమ్ములాటలు వెళ్ళి నట్లు పోలీసు వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.

ఎన్నికల వేళ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మెచ్చుకుని యాదవ్‌ మరోసారి వివాదాల సుడిగుండంలోకి వెళ్ళగా, ముఖ్యమంత్రి అనుగ్రహం అనుకూలంగా మారింది. ఈ సమ యంలో నియమితులైన మహంతి తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తిగా ముద్రపడటంతో ముఖ్యమంత్రి మరోసారి యాదవ్‌కు అవకాశాన్ని కల్పించారనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేశారని మేహశ్‌చంద్రలడ్డా వంటి సమర్ధవంతులైన అధికారులపై కూడా చర్యలు చేపట్టారు. ‚టీడీపీ హయాంలో పనిచేసిన పోలీసు అధికారులను లూప్‌లైన్‌లకే పరిమితం చేయడం వల్ల కూడా యాదవ్‌ వై.ఎస్‌.కు దగ్గరయ్యాడన్నే చర్చ ఉంది. దీంతో ఇద్దరు బాస్‌ల వర్గ పోరాటాల్లో పోలీసు ఉన్నతాధికారులు సమిధలవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X