వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని రేసులో బాబు?

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చంద్రబాబు నాయుడి దృష్టి ప్రధానమంత్రి పదవిపై పడిందా? అలాగని ఖచ్చితంగా చెప్పలేం గానీ విధి వశాత్తు ప్రధాని పదవి చేపట్టవలసి వస్తే అందుకు చంద్రబాబు వెనుకాడబోరని ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిజెపి సారధ్యంలోని ఎన్డీయేలో చేరకూడదని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ తో బద్ధవైరం ఉన్నందువల్ల కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎకు టిడిపి మద్దతు ఇచ్చే అవకాశం లేదు.

చంద్రబాబు నాయుడి కోసమైనా ఇప్పుడు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అనివార్యం కాబోతోంది. ఎన్డీఏ, యుపిఎలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్ధితిలో ఉంటే, థర్డ్ ఫ్రంట్ కు అవకాశం లభించవచ్చు. అప్పుడు ప్రధాని పదవి చేపట్టమని చంద్రబాబు నాయుడికి ఆఫర్ రావచ్చు. అటువంటి పరిస్ధితిలో ప్రధాని పదవి చేపట్టడానికి చంద్రబాబు మానసికంగా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ నిద్రలో ఉండే దేవెగౌడ్ ప్రధానిగా ఉండగా లేనిది తనకేం తక్కువని చంద్రబాబు నాయుడు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటూ ఉండవచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు అని మాత్రం అడవద్దు. మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X