వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిత్తరపోయిన బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
సూర్యాపేటలో మహాకూటమి తొలి బహిరంగసభ వెలవెలబోవడం దేనికి సంకేతం? పదివేల మందికి మించి జనం రాలేదని కాంగ్రెస్ అధికార పత్రిక రాసినా, ఇరవై వేలు దాటి ఉండరని అందరూ ఒప్పుకుంటున్నారు. బలమైన సంస్ధాగత పునాదులు, నెట్ వర్క్ లేని చిరంజీవి ప్రజారాజ్యం బహిరంగసభలకు లక్షల సంఖ్యలో జనం హాజరవుతున్నారు. నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదులుతున్నాయా? సభకు వచ్చిన జనం నుంచి ప్రతిస్పందన కూడా చాలా తక్కువగా ఉంది. దీనితో బిత్తరపోయిన బాబు సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ ను కూడా ఈ ఎన్నికల్లో టిడిపి బాగా వాడుకుంటోంది. అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్టు ఆరోపణలు ఉన్న చంద్రబాబు ఆయన పేరును అంత ఎక్కువగా ఉపయోగించుకోవడం నైతికంగా సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబు నగదు బదిలీ పథకం, పేదలకు ఉచిత కలర్ టీవీలు, ఉచిత బియ్యం పథకం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ జనం నమ్ముతున్నారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అన్ని సభలకూ వెళ్తున్న సామాన్య ఓటరు నోరు మెదపడంలేదు. అయితే ఇప్పటికే వారు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ టిడిపికీ పెద్ద దెబ్బ కాగా ప్రజారాజ్యంలో పార్టీలో సీనియర్లు ఆగ్రహంగా ఉండడం, కొందరు రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో ఆ పార్టీ గురించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఒకే స్పీడులో వెళ్తున్న కాంగ్రెస్ ఎక్స్ ప్రెస్ ఈ పరిస్ధితి తమకు అనుకూలమని భావిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X