వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరికి కోపం తెప్పించిన ఆమె!

By Staff
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
ఒకనాటి అగ్రదర్శకుడు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దాసరి నారాయణరావుకు అతిశయం ఎక్కువ. ఆయన ఎంత ప్రతిభావంతుడో అంత చాందసుడు. మైకు పుచ్చుకుంటే ఆయనకు మైకం వస్తుంది. అయితే తాను చెప్పదల్చుకున్నది స్పష్టంగా చెప్పడం ఆయనలో ఉన్న గొప్పదనం. తెలుగుపరిశ్రమ పెద్ద దిక్కుల్లో ఆయన ఒక ప్రముఖుడు.

ఇటీవల ఒక సినిమా ఫంక్షన్ లో ఇలియానా ఆయనను విష్ చేసిన తీరు ఆయనకు ఆగ్రహం తెప్పించిందట. పరభాషా హీరోయిన్లు అయినా గతంలో తెలుగు తరహా వినయాన్ని నేర్చుకుని మసలుకునేవారు. ఇలియానా వంటి వారికి ఆ వినయం వంటబట్టడం లేదు. దానితో కోపమొచ్చిన దాసరి ఆ ఫంక్షన్ నుంచి మధ్యలోనే నిష్కృమించారట. ఇలియానా మాత్రం తనను తాను సమర్ధించుకుంటోంది. తనకు వచ్చిన భాష, సంభోదన అదేనని, తానేమీ చేయలేనని అంటోంది. దాసరి సినిమా రంగంలోనే గాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రముఖ వ్యక్తి. ఆయనంటే ముఖ్యమంత్రి వైఎస్ కు కూడా గౌరవం. ఇలియానా వంటి వారికి తెలుగు పెద్దలను ఎలా గౌరవంగా సంబోధించాలో కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందేమో.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X