వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోసపోయిన దాసరి!

By Staff
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
డబ్బు విషయంలో దాసరి నారాయణరావు చాలా జాగ్రత్తపరుడని సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరికీ తెలుసు. ఆయన మాట విషయంలోనే భోళా కానీ మనీ విషయంలో కాదు. ఆ విషయంఉ"ఉదయం"లో పని చేసిన జర్నలిస్టులకు బాగా తెలుసు. దాసరి నారాయణరావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న ఆ నలుగురూ పైరవీలు చేసుకుని కోట్లాది రూపాయలు సంపాదించారట. కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ప్రధాన మంత్రికి చేరవేయడంతో దాసరి మంత్రి పదవి ఊడిపోయింది.

ఇటీవల దాసరి సన్నిహితుడే ఆయనను దారుణంగా మోసగించాడని తెలుస్తోంది. దాసరికి రావలసిన పెద్ద మొత్తాన్ని వసూలు చేసుకుని అతను మొహం చాటేస్తున్నట్టు సమాచారం. దాసరి పంపించారంటూ ఢిల్లీ వెళ్ళిన ఆ వ్యక్తి, దాసరి ముందస్తుగా చేసిన సంతకాలున్న కాగితాలను ఇచ్చి కోట్లలో మొత్తాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చి దాసరికి కన్పించకుండా జంప్ జిలానీ అయ్యాడని చెబుతున్నారు. దాసరి ఢిల్లీలి ఫోన్ చేయగా, ఆ డబ్బును మీ మనిషికి ఇచ్చామని వారు చెప్పారట. తన మనిషిని పిలిపించి దాసరి మందలించగా" అవును, నాకు అవసరమైంది, వాడుకున్నాను, డబ్బు వచ్చినప్పుడు ఇస్తాను" అని తాపీగా చెప్పడంతో సినిమా ఫక్కీలో షాక్ తినడం దాసరి వంతు అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X