వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మహాసామ్రాజ్యం!

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడి వైఎస్ జగన్ తన "సాక్షి" చానల్ ప్రారంభం సందర్భంగా చేసిన ప్రసంగం చాలా మందిని ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. జగన్ లో ఇంత పరిపక్వత ఉందా అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. అయితే జగన్ పరిపక్వత వెనుక ఎన్నో ఎదురు దెబ్బలు ఉన్నాయి. మేటాస్ తో జగన్ కు ఉన్న 'అక్రమ సంబంధం' సిబిఐ దర్యాప్తులోనైనా బయటపడుతుందని విపక్షాలు ఆశిస్తున్నాయి. ఇంకా జగన్ జగతి పబ్లికేషన్స్, రఘురామ్ సిమెంట్స్, మరో డజను బినామీ కంపెనీల వ్యవహారం వారికే ఆందోళన కలిగిస్తోంది. రాజశేఖరరెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారని వివిధ సర్వే (అవి ఎంత విశ్వసనీయమైనవో చెప్పలేం) లలో వస్తున్నందువల్ల జగన్ కొంచెం ధైర్యంగా ఉండవచ్చు. మళ్ళీ వైఎస్ ముఖ్యమంత్రి అయితే జగన్ వ్యాపార సామ్రాజ్యం మరి కొన్ని వేల కోట్లకు విస్తరిస్తుందనడంలో సందేహం లేదు.

చంద్రబాబు నాయుడు తన కుమారుడిని వ్యాపారాల్లో దింపాలనుకున్నా అతనికి అంత పరిపక్వత లేకపోవడంతో ప్రస్తుతానికి "సుద్ద" లాగే ఉంటుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మంచి సిఇవోలను పెట్టుకుని కొడుకు చైర్మన్ గా చాలా వ్యాపారాలు చేయాలన్న ఆశలు చంద్రబాబుకు ఉన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X