వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్రినాకు కౌగిలింతల కష్టాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Katrina Kaif
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కౌగిలింతల కష్టాల్లో పడింది. రణబీర్ కపూర్ ను కౌగిలించుకున్న చిత్రాలను టెలివిజన్ చానెల్స్ ప్రసారం చేయడం ఆమెకు కష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఆ చిత్రాలను ప్రసారం చేసినందుకో, రణబీర్ కపూర్ ను కౌగలించుకున్నందుకో కాకుండా బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ కు కోపం వస్తుందని ఆమె భయపడుతున్నట్లుంది. ఆమె టీవీ చానెళ్లపై అగ్గి మీద గుగ్గిలమవుతోంది. చిత్రంలోని ఫొటోల గురించి చెప్పేదేమీ లేదని, రాజనీతి చిత్రం కోసం భోపాల్ వీధుల్లో తీసిన చిత్రంలోని దృశ్యాలను అలా ప్రసారం చేస్తున్నారని, యూనిట్ కు సంబంధంలేని కెమెరాతో ఆ చిత్రాలు తీసి ఉంటారని ఆమె అంటోంది.

తమకు తెలియకుండా చిత్రాలు తీయడం చట్ట వ్యతిరేకమని, చిత్రంలోని దృశ్యాలను స్కూప్ గా ఎలా ప్రచారం చేస్తారని ఆమె అంటోంది. రాజనీతి చిత్రం వేసుకున్న దుస్తుల్లోనే ఆ ఫొటోలు ఉన్నాయని, వాటిని ప్రజలు సులభంగా గుర్తించగలరని ఆమె చెబుతోంది. ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్ ఫంక్షన్ కు డుమ్మా కొట్టింది. ఇవన్నీ సల్మాన్ ఖాన్ కోసం ఆమె చెప్పినట్లే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X