వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ సావంత్ పెళ్లి 'షో'

By Staff
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
రియాల్టీ షో ద్వారా నిజంగానే పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన రాఖీ సావంత్ మాటలన్నీ ఉత్తవేనా. రేపు (ఆదివారం) టీవీ రియాల్టీ షో ద్వారా ఆమె పెళ్లి జరుగుతుందని, దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దామని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నవారికి ఆమె నిరాశనే మిగులుస్తోంది. కేవలం రియాల్టీ షో పాపులారిటీ కోసమే ఆమె ఇంత వరకు ఆ మాటలు చెప్పిందనే అభిప్రాయం బలాన్ని పుంజుకుంటోంది. రాఖీ స్వయంవర్ కు ఒక్క రోజు గడువు ఉందనగా తాను పెళ్లి చేసుకునే ఉద్దేశాన్ని మార్చుకున్నట్లు ఆ అందాల బామ చెప్పింది. పెళ్లి చేసుకోవడానికి ముందు కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.

మానవ్ కు కేవలం 23 ఏళ్ల వయస్సేనని, అయితే చాలా మాచ్యూర్ అని, తాను మరో అభిషేక్ అవస్థీని కాదలుచుకోలేదని అతనంటున్నాడని, తాను స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పాడని, పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నట్లు, దానికి కొంత సమయం పట్టనున్నట్లు అతను చెబుతున్నాడని రాఖీ అంటోంది. ఎలేష్ కూడా ముంబైలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. చిటిజ్ తనను ప్రేమించడం లేదని చెప్పాడని అంటోంది. ఈ విధంగా ఏదో ఒక కారణం చెప్పి ఆమె పెళ్లిని కాదనే పరిస్థితిని సృష్టిస్తోంది. ఈ రకంగా టీవీ రియాల్టీ షో మరింత కాలం కొనసాగుతుందా. రాఖీ సావంత్ డ్రామా అందులో భాగమేనా. కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X