వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ ఉండవల్లి వ్యూహాలు!

By Staff
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
ఉండవల్లి అరుణ్ కుమార్ కు అపర చాణుక్యుడు అన్పించుకోవాలని ఆరాటం. రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పై అన్ని రకాల పోరాటాలు చేయడం ద్వారా ఆయన ఆ పేరును చాలా వరకు సార్ధకం చేసుకోగలిగారు. వైఎస్ తో ఆయనకున్న అనుబందం మాటల్లో చెప్పలేనిది. తెలుగుదేశంపై పోరాటంలో వైఎస్ కు ఐడియాలు అందించినవారిలో ఉండవల్లి అగ్రగణ్యుడు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అనేక రాజకీయ వ్యంగ్య సినిమాలు రూపొందించారు ఉండవల్లి.

వైఎస్ మరణం ఉండవల్లిని బాగా కుంగదీసింది. అయినా ఆయన తేరుకుని సోనియా గాంధీ వచ్చే సమయానికి హైదరాబాద్ చేరుకుని ఆమె వెంటనే ఉన్నారు. మొన్న సోనియా గాంధీని కలిసిన ఉండవల్లి తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్ది పై ఆమెకు కొంత సమాచారం అందించినట్టు సమాచారం. వైఎస్ వంటి నాయకుడిని తిరిగి తెచ్చుకోలేమని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ కు అనుకూలంగానే ఆయన చెప్పినా సోనియాగాంధీ అందుకు అనుకూలంగా స్పందించలేదని, అందువల్ల ఆ విషయంలో పట్టుబట్టకుండా ఉండవల్లి బయటపడినట్టు సమాచారం. వైఎస్ కాకుండా ఆ కుటుంబానికి చెందని మరో వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఉండవల్లి వ్యూహాలు నడవవు. ఆయనకు మళ్ళీ టికెట్ వచ్చినా గెలుపు కష్టమవుతుంది. అందువల్ల ఈ అపర చాణుక్యుడు జగన్ ముఖ్యమంత్రి కావడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X