హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజుకు ఉండవల్లి మంత్రా?

By Staff
|
Google Oneindia TeluguNews

Undavalli
సత్యం రామలింగరాజును ఇంకా కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా వెనకేసుకొస్తున్నారు. ఉద్యోగుల, షేర్ హోల్డర్ల శ్రేయస్సును చూడాలంటూ చిలకపలుకులు ఒల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎంపీ ఉండవల్లి వరకు అవే పలుకులు. మరి రామోజీ సంస్ధల్లో కూడా వేలాది ఉద్యోగులు ఉన్నారు కదా, అప్పుడు ఈ వాదన ఎందుకు రాలేదు? రామోజీ సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులు అంటరాని వారా? రాజు గారి కంపెనీలో ఉన్న ఉద్యోగులు అంటదగిన సనాతనులా? ఉండవల్లి ఈ ప్రశ్నకు మొదట జవాబు చెప్పవలసి ఉంటుంది.

రామలింగరాజు తనంతట తాను లొంగిపోయారని, రామోజీరావు అలా కాకుండా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ఉండవల్లి అంటున్నాడు. ఒక న్యాయవాదిగా ఏ కేసుల, ఏ సెక్షన్ల తీవ్రత ఎలా ఉంటుందో ఉండవల్లికి తెలియదనుకోవాలా? లేక వితండవాదమనుకోవాలా? ఇప్పటికీ ఉండవల్లి నెలరోజుల్లో రామోజీరావును జైలుకి పంపిస్తానని బీరాలు పలుకుతున్నాడు. మరి ఈనాడు గ్రూపు సంస్ధల ఉద్యోగుల శ్రేయస్సు ఈయనకు పట్టదా?

మూడేళ్ళుగా రామోజీరావు వెంటపడుతున్నా ఆయనను జైలుకి పంపించలేకపోయిన వారు నెలరోజుల్లో ఎలా పట్టుకోగలరు? నాగార్జున ఫైనాన్స్ వ్యవహారాన్ని ఈనాడు యజమాని తలకు చుట్టి ఏదో చేయాలన్నది ఎన్నికల ముందు ఉండవల్లి ఆలోచనగా కనిపిస్తోంది. అటు లాయర్ గా ఫెయిలై, ఇటు ఎంపీగా కూడా విఫలమై, మళ్ళీ గెలుస్తానన్న నమ్మకం లేన ఉండవల్లి వెర్రి ప్రేలాపనలు పేలుతున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X