వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజుకు జైలే భద్రమా?

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
రామలింగ రాజుకు జైలు గది వాస్తు బాగా నచ్చిందా? వేలాది కోట్లు సంపాదించినప్పుడు లేని ప్రశాంతతను ఆయన ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? చంచల్ గుడా జైలులో హాయిగా పుస్తకాలు చదువుకుంటూ, టీవీ కార్యక్రమాలు చూస్తూ కాలం గడుతున్న సత్యం రామలింగరాజు బెయిల్ కోసం సీరియస్ గా ప్రయత్నించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన హాయిగా బెయిల్ తీసుకుని ఇంటికి వెళ్ళవచ్చు కదా అని పోలీసు అధికారులు అంటున్నారు. రాజు బెయిల్ కంటే జైలే పదిలమని ఎందుకు అనుకుంటున్నారని వారు ఊహాగానాలు చేస్తున్నారు.

ఆర్ధిక సంక్షోభంలో పడడానికి ముందు రామలింగరాజు అందిన చోటల్లా వందల కోట్లలో అప్పులు చేశారని, బయటికి వస్తే ఆ రుణదాతలను ముఖాముఖి ఎదుర్కోవలసి ఉంటుందని రాజు భయపడుతున్నారని ఒక సమాచారం. రియల్ ఎస్టేట్ లో రాజుకు భారీ పెట్టుబడులు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు రియల్ ఎస్టేట్ పరిస్ధితి బాగుండలేదు. బాగు పడిన తర్వాత కొన్ని వందల ఎకరాలను అమ్మి అప్పులు తేర్చే పరిస్ధితి వచ్చిన తర్వాతే జైలు నుంచి బెయిల్ మీద బయటపడాలని ఆయన అనుకుంటున్నట్టు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X