వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో చిరంజీవి క్లాసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

chiranjeevi
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సన్నబడేందుకు అవసరమైన శస్త్రచికిత్స చేసుకునేందుకు అమెరికా వెళ్లారని అంటున్నారు. తాను నటించబోయే 150వ చిత్రంలో స్లిమ్ గా కనిపించడానికి అందుకు ఆయన సిద్ధపడ్డారట. అమెరికా పర్యటన నుంచి ఆయన తిరిగి వచ్చారు. అయితే, అమెరికా పర్యటనను ఆయన మరో విధంగా కూడా ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు. ఆయన అక్కడ కొంత రాజకీయ శాస్త్ర నిపుణుల వద్ద శిక్షణ పొందారని వినికిడి. రాజకీయాల్లో రాణించాలంటే ఏం చేయాలనే విషయంపై ఆయన శ్రద్ధగా పాఠాలు చెప్పించుకున్నారట. కామన్ ఫ్రెండ్స్ కొంత మంది ఆయనకు రాజకీయ శాస్త్ర పండితులను చిరుకు పరిచయం చేశారని తెలుస్తోంది. వారు చెప్పిన పాఠాలు చిరుకు బాగా నచ్చాయట. ప్రభుత్వంపై ఎల్లవేళలా విమర్శలు చేయవద్దని, అలా చేస్తే రొటీన్ అయిపోయి విసుగు పుడుతుందని, అలా కాకుండా నెలకు ఒకసారో, రెండు సార్లో ఘాటుగా విమర్శించాలని వారు చిరంజీవికి బోధించారట. అలా చేసే విమర్శలను అందరూ పట్టించుకుంటారని, అనవసరంగా విమర్శలు చేయరనే అభిప్రాయం కలుగుతుందని చెప్పారట. అంతేకాకుండా, క్యాడర్ లో నుంచి అప్పుడప్పుడు ఎవరో ఒకరిని గుర్తించి అతనికి పదవి కట్టబెట్టాలని వారు చిరంజీవికి సూచించారని సమాచారం. అలా చేయడం వల్ల తమకు గుర్తింపు ఉంటుందని, కార్యకర్తలు చురుగ్గా పని చేస్తారని సలహాలు ఇచ్చారట. ఏమైనా, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీడియా వేసిన ప్రశ్నలకు గతంలో మాదిరిగా తడుముకోకుండా చకచకా సమాధానాలు ఇచ్చారు ఆయన. దీన్నిబట్టి క్లాసులు బాగానే పనిచేశాయని అనుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X