వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్ కు లావు దెబ్బ, హై కమాండ్ కు చావు దెబ్బ..

By Santaram
|
Google Oneindia TeluguNews

D Srinivas
డి శ్రీనివాస్ ను గెలిస్తే ఆయనను కొద్ది కాలం తర్వాత ముఖ్యమంత్రిని చేసి జగన్ కు చెక్ పెట్టాలన్న సోనియాగాంధీ ఆకాంక్ష నెరవేరలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు సోనియాగాంధీ మంచి విలువ ఇస్తూ వచ్చారు. డిఎస్ ను అడ్డుపెట్టుకుని తెలంగాణ వాదాన్ని నీరుగార్చాలని కాంగ్రెస్ హై కమాండ్ ప్లాన్ చేస్తూ వచ్చింది. డి. శ్రీనివాస్ ఓడిపోవడంపై కొన్ని చోట్ల జగన్ అభిమానులు పండుగ చేసుకోవడం గమనార్హం. ఫైర్ బ్రాండ్ అయిన జగన్ కంటే వీర విధేయుడైన డిఎస్ ను ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ ను తమ చేతుల్లో ఉంచుకోవాలన్న హై కమాండ్ గేమ్ ప్లాన్ విఫలమైంది.

విజయంకోసం చతుర్విధోపాయాలూ ప్రయోగించారు. తాను గెలిస్తే పెద్ద పదవి వస్తుందని, బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణను తీసుకువస్తానని పదే పదే చెప్పారు. కేసీఆర్‌ దుకాణం బంద్‌ అవుతుందని, అందుకే అంత భయపడుతున్నారని ఎదురుదాడికి దిగారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేదీ కాంగ్రెస్‌ అయినప్పుడు తనను కాక ఎవరిని గెలిపిస్తారని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పుడు డిఎస్ ను పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించే విషయంలో హై కమాండ్ మరో ఆలోచన చేయవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X