వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చందు పేరుతో జ్యోతి బుకాయింపు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jyothi
వ్యభిచారం కేసులో పట్టుబడిన నటి జ్యోతి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఇచ్చి వాంగ్మూలం వివరాలు వేరుగా ఉండగా ఆమె టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనకే పాపమూ తెలియదని, పోలీసులే తనను ఇరికించారని అంటోంది. అందులోకి చందు అనే పేరును లాగుతోంది. ఆ చందు ఎవరో ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. సినిమా ఛాన్స్ ఇస్తామని తనకు చందు రెండు సార్లు ఫోన్ చేసినట్లు చెప్పింది. సినిమాల్లో వ్యాంప్ పాత్రలు వేసినంత మాత్రాన తాను వ్యాంప్ ను కానని చెప్పింది. తనకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా సినిమాల్లో నటించడానికి అనుకున్నట్లు చెప్పింది. సైరాబాను ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది.

కాగా, సైరాబాను కూడా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అదే విధంగా మాట్లాడింది. తాను వ్యభిచారం చేయలేదని చెప్పింది. తనను కేసులో కావాలని ఇరికించినట్లు ఆరోపించింది. టీవీ చానెల్ ప్రశ్నలకు తన ఇంటి నుంచి సమాధానాలు ఇస్తూ పోయిన ఆమె కొంత సేపటికి ఇరకాటంలో పడిపోయింది. తానేమీ చెప్పనంటూ కనెక్షన్లను లాగేసి పక్కకు వెళ్లిపోయింది. ఏమైనా, స్వయానా పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ తమ వద్ద వారు వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా ఆధారాలున్నాయని చెబుతున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుందనేది ఈ ఇద్దరు తారామణులను చూస్తుంటే అనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X