వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి రేసులో కెవిపి రామచంద్రరావు, సురేష్ రెడ్డి, కేశవరావు

By Santaram
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ స్ధానంలో కెవిపి రామచంద్రరావు నియమితులు కావచ్చు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతానని అయన హైకమాండ్ కు సవినయంగా మనవి చేసుకున్నప్పటికీ వాళ్ళు ఆయనను సెప్టెంబర్ వరకు కొనసాగమని కోరినట్టు తెలుస్తోంది. డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా వైదొలుగుతున్నారని తెలిసి కొందరు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.

కెవిపి రామచంద్రరావును పిసిసి అధ్యక్షుడిని చేస్తే జగన్ వర్గం వ్యతిరేకించదు. పైగా ఆయన ఆయన ఈమధ్య హైకమాండ్ కు వీర విధేయుడిగా మారారు. ఆయనకు కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు కలెక్షన్ కింగ్ గా పేరుంది. వైఎస్ కు ఆప్త మిత్రుడైనా ఆయన మరణం తర్వాత కెవిపి జగన్ కంటే హై కమాండ్ కే చేరువయ్యారు. వైఎస్ ఉన్నప్పుడు కెవిపిని సంప్రదించనిదే ఆయన ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. ఆ క్రమంలో ఆయన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేరువయ్యారు. కెవిపిని పిసిసి అధ్యక్షుడిని చేస్తే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు. మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు కె కేశవరావు కూడా పిసిసి రేసులో ఉన్నారు. ముగ్గురి ఇంటిపేర్లు కె తోనే ప్రారంభం కావడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X