వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు అండగా విష్ణు భార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Veronica
హీరో మంచు విష్ణు భార్య విరోనికా వైయస్ జగన్ కు అండగా నిలుస్తోంది. వైయస్ జగన్ కు ఆమె సోదరి అవుతుంది. మంచు విష్ణు దివంగత నేత వైయస్ రాజశేఖరెడ్డి సోదరుడి కూతురు విరోనికాను వివాహమాడాడు. దీంతో విష్ణుకు, వైయస్ జగన్ కు మధ్య బంధుత్వం ఉంది. ఈ నెల 2వ తేదీన విరోనికా రోజంతా వైయస్ జగన్ ఇంట్లోనే ఉంది. జగన్ తన తల్లి వైయస్ విజయమ్మతో కలిసి పులివెందుల నుంచి హైదరాబాదు వచ్చారు. ఆ రోజంతా తనను కలవడానికి వస్తున్న నేతలతో వైయస్ జగన్ బిజీగా ఉన్నారు. వైయస్ విజయమ్మకు విరోనికా తోడుగా ఉంది. వైయస్ జగన్ లోకసభ సభ్యత్వానికి, తాను శాసససభా సభ్యత్వానికి రాజీనామాలు చేయడమే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా దూరం కావాల్సి రావడంతో వైయస్ విజయమ్మ తీవ్రంగా కలత చెందినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో విరోనికా వైయస్ విజయమ్మ ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X