వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ గార్డియన్ గా జనార్ధన్ రెడ్డి!

By Santaram
|
Google Oneindia TeluguNews

Nedurumalli Janardhan Reddy
హైకమాండ్ మాట వింటే జగన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి చెప్పడం వెనుక అనేక విషయాలు దాగి ఉన్నట్తు కన్పిస్తోంది. దూకుడుగా వెళ్ళవద్దని జగన్ కు నచ్చజెప్పవలసిందిగా నేదురుమల్లికి సోనియా సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటున్న పెద్ద రెడ్లు కూడా జగన్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేలా పునాది వేయాల్సిన బాధ్యతను నేదురుమల్లికి అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ విధంగా రెండు బాధ్యతలను ఆయన మోస్తున్నారు. రెండు బాధ్యతలు, ఒకే లక్ష్యం.

కడప ఎంపీ జగన్‌ కి మంచి భవిష్యత్తు ఉందని, ఆయనకు తాము మద్దతిస్తామని నిన్న నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి తెలిపారు. అయితే ఆయన అధిష్ఠానం ఆదేశానుసారం పని చేయాలని సలహా ఇచ్చారు. నెల్లూరులోని ఇందిరాభవన్‌ లో మంగళవారం నేదురుమల్లికి ఆత్మీయ సన్మానం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సోనియాగాంధీ మాటే వేదమన్నారు. నెల్లూరు పార్లమెంటు స్ధానాన్ని తాను ఆశించానని, అయితే సోనియా గాంధీ పిలిచి పార్లమెంటు వద్దు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారన్నారు. అందుకు ఎదురుచెప్పకుండా ఒప్పుకున్నానన్నారు. ఇందిరా కుటుంబానికి ఏజెంటుగా పనిచేయటమే తనకు తెలిసిన విద్య అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల మన్నలను పొందారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X