• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రసపట్టులో ఉన్నది రంజిత, నిత్యానందలే!

By Santaram
|

Nityananda Swami
ఆ సెక్స్ వీడియోలో ఉన్నది నిత్యానంద, రంజితలేనని ఫోరెన్సిక్ నివేదికల ద్వారా రుజువైనట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. వారిద్దరూ మంచి రసపట్టులో ఉన్నప్పుడు నిత్యానంద డ్రైవర్ ఆ వీడియోను తీసి పోలీసులకు అందించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రంజిత నుంచి ఫిర్యాదు వచ్చి ఉంటే నిత్యానందకు జైలు శిక్ష ఖాయంగా పడి ఉండేది. ఆమె ఫిర్యాదు లేకపోవడం స్వామీజీని దాదాపు గట్టెక్కించినట్టైంది. నిత్యానందకు జైలో బెయిలో ఈరోజు తేలిపోనుంది.

ధ్యానపీఠం వ్యవస్థాపకుడు నిత్యానంద పరమహంస సర్వసంగ పరిత్యాగి కాదని, సన్యాసి అంతకన్నా కాదని ఆయన తరుపు న్యాయవాది బి.వి.ఆచార్య తన వాదనలు వినిపించారు. ఆయన ఆధ్యాత్మిక అంశాలను ప్రచారం చేసే బోధకుడు మాత్రమేనని మాజీ అడ్వకేట్‌ జనరల్‌, నిత్యానంద తరుపు న్యాయవాది బి.వి.ఆచార్య వాదించారు. అందరి మనుషుల్లానే ఆయన కూడా స్త్రీ సాంగత్యాన్ని పొందటంలో తప్పేముందని పేర్కొన్నారు. ఆశ్రమానికి వెళ్లేవారిలో భార్యాభర్తలు ఉండేవారని, సంసార జీవితంలో మధురిమలు నింపుకునేందుకు తీసుకోవలసిన చర్యలను నిత్యానంద బోధించేవారని గుర్తు చేశారు.

నిత్యానందను సిమ్లాలో అరెస్టు చేసి తీసుకువచ్చిన తరువాత సి.ఐ.డి. పోలీసుల విచారణ పూర్తయిందని తెలిపారు. ఆయన్ను జైల్లో బంధించి ఉంచాల్సిన అవసరం లేదని న్యాయమూర్తికి చెప్పారు. నిత్యానందను విడుదల చేస్తే ఎక్కడికీ వెళ్లరని, జైల్లో బంధించి ఉంచటం వ్యక్తిగత స్వాతంత్య్రానికి భంగమని పేర్కొన్నారు. తనను నిత్యానంద వంచించారని ఎవరూ ఫిర్యాదు చేయనందున అరెస్టు కూడా సబబు కాదని న్యాయమూర్తికి విన్నపం చేశారు. రంజిత కూడా తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X