వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆ వీడియో నాదే, కానీ సెక్స్ లేదు'

By Santaram
|
Google Oneindia TeluguNews

Ranjitha
నిత్యానంద స్వామితో బెడ్ రూమ్ లో గడిపింది తానేనని, అయితే తమ మధ్య సెక్స్ సంబంధం లేదని, అది ఆధ్యాత్మిక సంబంధమని సినీనటి రంజిత కుముదం మ్యాగజైన్ కు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. స్వామి ఆత్మ గొప్పదని, ఆయనకు మసాజ్ వంటి సేవలు చేశానని ఆమె చెప్పింది. మరిన్ని వివరాలను స్వామి కుంభమేళా నుంచి తిరిగి వచ్చాక చెబుతానని ఆమె వెల్లడించింది.

ఆ వీడియో క్లిప్ లో ఉన్నది తానేనని ఆమె అంగీకరించడం విశేషం. అయితే ఆ వీడియో క్లిప్ లో ఆమె తెల్లటి చీరలో హుందాగా కన్పించింది. ఒక్క సందర్భంలోనే ఆమె స్వామీజీ మీదికి ప్రేమగా ఎగబాకడం ఆమె కుడి కాలు ఆచాదన లేకుండా ఉండడం చూడవచ్చు. స్వామీజీకి ఆమె ఒక టాబ్లెట్ ఇవ్వడం, ఆ తర్వాత స్వామీజీ యోగా భంగిమలో కన్పించడం, ఆ క్రమంలో ఆయన పంచె తొలగిపోయి అండర్ వేర్ కన్పించడం జరిగిపోయాయి. స్వామీజీకి కాళ్ళు పట్టడం వంటి సేవలు చేశానే తప్ప సెక్స్ లో పాల్గొనలేదని ఆమె చెబుతోంది. ఈ ఉదంతం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X