వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై రోశయ్య వార్!

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఒక పథకం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిని కలిశారు. చాలా మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన రోశయ్య చాలా మంచి పరిపాలనా దక్షుడు. వైయస్ హయాంలో కూడా ఆర్ధిక మంత్రిగా పని చేసిన ఆయనకు ప్రజల సొమ్ము దుబారా అయిపోతోందన్న భయం ఉండేది. అయినా వైయస్ అంటే ఇంకా ఎక్కువ భయం కాబట్టి ఆయన "చూచీ చూడకుండా" ఉండిపోయారు.

రోశయ్యకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎంతగానైనా తినడానికి అవకాశముంది. ఆయన నీతిమంతుడని ఎవరూ చెప్పరు. పెద్ద అవినీతి పరుడని కూడా ఎవరూ చెప్పరు. సహజంగా తాను పుట్టిన కుటుంబ నేపధ్యం వల్ల తాను పొదుపుగా ఉంటానని (అనేక సార్లు ఆయనే అసెంబ్లీలో చెప్పుకున్నారు). రోశయ్యకు కోటరీగా కొందరు ఉన్నారు. వాళ్ళు రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నంత డైనమిక్ కాదు. ఈ వయసులో పెద్దాయనకు పెద్దగా డబ్బుల అవసరం లేకపోవచ్చు. కానీ వైయస్ జగన్ అనే ప్రత్యర్ధిని ఎదుర్కోడానికి ఆయన తన శాయ శక్తులను వినియోగిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X