వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ వెలుగులకీ 'సాక్షి'?

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
మనం చిన్నప్పుడు ఒక రాక్షసుడి కథ చదువుకున్నాం. ఆ రాక్షసుడు రోజుకి ఒక బండెడు అన్నం తింటాడు. రోజుకొకరు ఆ బాధ్యత తీసుకుని పంపించాలి. లేకపోతే పంపని వాళ్ళని తినేస్తాడు. అలాగే ఉంది సాక్షి పత్రిక ఉదంతం. సాక్షి దినపత్రికపై రోజుకి కోటి నష్టమన్న ప్రచారం వైయస్ బతికి ఉన్నప్పుడు, ఆ పత్రిక ప్రారంభమైనప్పుడు ఉండేది. అంటే సంవత్సరానికి 365 కోట్ల నష్టం. అంత డబ్బును ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారో సాక్షి ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ లకే తెలియాలి. ఆదాయ వనరుల్లో పెద్ద తేడా లేదు కాబట్టి ఆ నష్టం అలాగే కొనసాగుతూ ఉందని అనుకోవాలి. ఈ తెల్ల ఏనుగుని జగన్ దొర ఎంత కాలం భుజాన వేసుకుని నడుస్తాడో అర్ధం కావడం లేదు.

జగన్ ముఖ్యమంత్రి అయితే ఇటువంటి ఐరావతాలను ఎన్నిటినైనా పోషించి ఉండే వాడు. ఆయన సిఎం కాలేదు. వచ్చే మూడేళ్ళలో ఆ పదవి దక్కుతుందన్న ఆశ లేదు. వస్తే గిస్తే ఎన్నికల ముందు అతని ఆ పదవి దక్కవచ్చు. అప్పటివరకు సాక్షి అనే తెల్లఏనుగును ఆ యన పోషించాలి. కాంగ్రెసు పార్టీ కోసం ప్రారంభమైన ఆ పత్రిక ఇప్పుడు కాంగ్రెసు కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. అంటే పార్టీ నిబద్ధత కాకుండా జగన్ నిబద్ధతతో పని చేస్తోంది. ఇటువంటి పత్రికల మనుగడ తాత్కాలికంగా రిమ్ జిమ్ గా కన్పించినా దీర్ఘకాలంలో కష్టమే. ధన బలం తప్ప సంపాదకీయ సత్తా ఒక్కటైనా ఉందా ఇన్నేళ్ళలో..రంగుల హంగులు తప్ప గుర్తుంచుకోదగిన ఒక మానవీయ కథనం ఈ పత్రికలో వచ్చిందా? ఏ వెలుగులకీ ప్రస్ధానం? కెరీరజమే తప్ప సమాజహితం ఎక్కడ? ఆలోచించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X