వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా చుట్టే షోయబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sania Mirza
గత కొంతకాలంగా వివాదాలలో కూరుకుపోయిన పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ఇప్పుడు తన పంతాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మొదట ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని అందరి చేత ఛీ అనిపించుకున్నాడు. జట్టునుండి తొలగించబడ్డాడు. ఆ తర్వాత ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జాతో పెళ్లి అని ప్రకటించగానే ఆయేషా మీరా అనే మహిళ తనను మొదట పెళ్లి చేసుకున్న షోయెబ్ సానియాను ఎలా పెళ్లి చేసుకుంటాడని, తనకు విడాకులు ఇచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలన్నది. అయితే ఆమె వ్యాఖ్యలను షోయెబ్ మొదట కొట్టి పారేశాడు. అయితే అయేషా అన్ని రుజువులు చూపించటంతో ఆమెను వదుల్చుకునేందుకు దిగివచ్చాడు. ఏమైనా మాట్లాడినా వివాదాస్పదంగా ఉండేవి.

అయితే షోయెబ్ ఈ మధ్య మంచివాడిగా కాదు.. కాదు.. మంచి భర్తగా మారిపోతున్నాడు. నిత్యం సానియా వెంటే ఉంటున్నాడు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడికే వెళుతున్నాడు. సానియాకు కొన్ని విషయాల్లో కాస్తా మార్గదర్శనం కూడా చేస్తున్నట్టు వినికిడి. ఆ మధ్య హైదరాబాదులో కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న సోనియాకు బాల్ అందిస్తూ కనిపించాడు. ఇప్పుడు ఆసియా పోటీలకు వెళ్లిన సానియా వెంట అతనూ వెళ్లాడు. గతంలో వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలను మరిచిపోవడానికి, మరిపింపచేయడానికి సానియా వెంటే ఉంటూ మంచి భర్త అనిపించుకుంటున్నట్టున్నాడు. ఇటీవల రాంచీలో భారత్, పాకిస్తానుల మధ్య వైరం పోతే బావుండునని అభిప్రాయాన్ని వ్యక్తం చేసి శబాష్ అనిపించుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X