వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్య-కోటి- జ్యోతి-మీడియా

By Santaram
|
Google Oneindia TeluguNews

Surya Prakash Rao
కాళేశ్వర్ బాబా నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసిన సూర్య పత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశరావు, విలేకరులు నాగరాజు, చంద్ర లలిత్ లపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ చానల్ బట్ట బయలు చేశాయి. నూకారపు నాదర్ గుల్ భూముల అక్రమాలను గతంలో ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. బిసీ కులానికి చెందిన నూకారపును మీడియా రంగంలోకి రాకుండా చేయడానికి అగ్రకుల మీడియా ప్రయత్నించిదని సూర్య పత్రిక రాసుకుంది.

ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనతో మీడియా మీద సామాన్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వార్త రాయడానికి ఇంత, రాయకుండా ఉండడానికి ఇంత అని డీమాండ్ చేస్తున్న కొందరు విలేకరుల మీద ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు ఒక పత్రికాధినేత ఒక బాబాను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలని ప్రయత్నించిన వైనం జుగుప్సాకరంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X