వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోబో నాదేంటున్న సడేమియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Robo
సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్, అందాల తార ఐశ్వర్య కలయికలో వచ్చిన రోబో చిత్రం తనదే అని విజయ్ ఆర్కే అనే నవలా రచయిత అంటున్నాడు. ఆ చిత్రాన్ని తన నవల ఆధారంగా తీసారని, దానిని శంకర్ ను కలపటం అంత తేలిక కాదని, అందుకే ఆయనకు మెయిల్ కూడా చేశానని విజయ్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు అడిగానని సమాధానం రాలేదన్నారు. తను వివాదం సృష్టించాలని అనుకోవటం లేదని, అది ఖచ్చితంగా తన చిత్రం కాబట్టే తాను అడుగుతున్నానని అన్నారు. ఈ విషయంలో రజనీని, శంకర్ ను కలుస్తానని ఆయన చెప్పారు.

రజనీకి ఖచ్చితంగా ఉండే వ్యక్తి అని, ఆయనకు ఈ విషయం తెలిసి ఉండక పోవచ్చన్నారు. తన కథగా ఒప్పుకోకుంటే కోర్టుకు వెళతానని, అప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కథల కొరత ఉన్నప్పుడు కొత్తవారికి అవకాశమివ్వాలని, అలా చేయటం ద్వారా కొందరికి పరిశ్రమలో ఉపాధి లభిస్తుందని, కొత్త కొత్త కథల వల్ల ప్రేక్షకులు సైతం సంతోషిస్తారని ఆయన అన్నారు. కాపిలకు పాల్పడటం మంచిది కాదన్నారు. కాని కొత్త వారిని పరిశ్రమ ప్రోత్సహించడం లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X