వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబోయే సిఎం బాబా? జగనా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెసు మధ్యలోనే ఉంటుంది. తెలుగుదేశం విజయం సాధిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి. మరి కాంగ్రెసు విజయం సాధిస్తే...జగన్ కావచ్చు. ఇంకా నలభై ఏళ్ళు కూడా రాని జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కంటే ఎన్నికల ముందు అతనికి సత్తా చూపించుకునే అవకాశమిచ్చి అలా ముందుకు వెళ్దామన్నది కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలా కన్పిస్తోంది.

అయితే ఎన్టీఆర్ మూడు దశాబ్దాల క్రితం వేసిన విత్తనాల ఫలితంగా తెలుగుదేశం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బలంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో అయినా వందకు తగ్గకుండా సీట్లు తెచ్చుకునే సత్తా టిడీపికి ఉంది. అయితే అంతకంటే ఎక్కువ తెచ్చుకుని అధికారంలోకి రావాలంటే చంద్రబాబు నాయుడు బ్యురాక్రాట్ అవతారం వదిలి "లీడర్" పాత్ర ధరించాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలి.

వచ్చే ఎన్నికల్ల్లో కూడా అంటే చంద్రబాబు నాయుడికి 64 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆ పార్టీ ప్రగతి మందగించిపోయిందని, ఆయన కొత్త పథకాలతో ముందుకు రావాలని అంటున్నారు. అయితే ఆయన గత ఎన్నికల్లో ప్రకటించిన కొత్త పథకాలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇక జగన్ కు "లీడర్" సినిమా దెబ్బ తగిలే అవకాశముంది. లీడర్ రాణాలాగా తన తండ్రి సంపాదించిన వేలాది కోట్లను జగన్ ప్రజలకు ఇవ్వలేదన్న ఫీలింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఉందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X