వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైస్తవానికీ వైయస్‌పైనే ఆంధ్రజ్యోతి నిందలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
మతమార్పిడులపై ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రిక వరుస కథనాలను ప్రచురిస్తోంది. సందు దొరికితే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని దులిపేసే ఆ పత్రిక మత మార్పిడులపైనా వదలేదు. రాష్ట్రంలో క్రైస్తవ మతంలోకి మార్పులు జరగడానికి వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని నిందిస్తూ సోమవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఉచిత విద్యుత్తు వంటి పథకాలతో పాటు వైయస్ అమలు చేసిన మరో పథకం ఉందంటూ దాన్ని క్రైస్తవ మత ఉద్ధరణగా ఆ పత్రిక చెప్పింది.

మైనారిటీల ప్రార్థనాలయాలకు గత ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయించేవారని, అయితే వైయస్ వచ్చాక జిల్లాలవారీగా గ్రామాలను ఎంచుకుని చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పింది. జిల్లాల్లో 226 చర్చిల నిర్మాణానికి, కొన్ని చర్చిల మరమ్మత్తుకు రెండున్నర కోట్ల రూపాయలను అప్పటి వైయస్ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపింది. మొత్తంగా వైయస్ హయాంలో మతమార్పిడులకు ఎక్కడలేని ప్రోత్సాహం లభించిందని చెప్పింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో మత ప్రబోధకుడిగా ఒక వెలుగు వెలిగిన కెఎ పాల్‌ను వెనక్కి నెట్టి వైయస్సార్ అల్లుడు బ్రదర్ అనిల్ హవా చోటు చేసుకుందని కూడా ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది.

English summary
Andhrajyothy Telugu daily blamed YS Rajasekhar Reddy for religious conversions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X