వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు చెక్: మరో తెలంగాణ పార్టీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకు మరో తెలంగాణ పార్టీ తెర మీదికి రానున్నట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్రమైన చర్చ సాగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉద్యమ అగ్రభాగాన లేకపోవడం తెరాస లోపంగా చాలా మంది చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం ఉంటే తప్ప తెలంగాణ ఉద్యమం ఫలితం సాధించదనే ఓ విశ్లేషణ సాగుతోంది.

ఈ వాతావరణంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నాయకత్వంలో కొత్త తెలంగాణ పార్టీ రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు. క్రెడిట్ కెసిఆర్‌కు ఒక్కడికే దక్కకుండా చేయాలనేది కూడా ఆ పార్టీ ఆవిర్భావానికి ఓ కారణమని చెబుతున్నారు. ఓ ప్రముఖ న్యాయమూర్తి ఈ పార్టీకి నాయకత్వం వహించవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. బహుశా, ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కావచ్చుననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

English summary
Buz is that a new party for Telangana may be formed under the leadership of a Reddy community to put check on TRS president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X