వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బంతికి అజర్ చిట్కా

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohammad Azharuddin
బౌలర్ వేసిన బంతిని బౌండరీ దాటించడమెలాగో తెలిసి మాజీ క్రికెటర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ తెలంగాణ బంతిని బౌండరీ దాటించడానికి ఓ చిట్కా చెప్పారు. ఆయన చిట్కా ఏమిటో తెలిస్తే ఇంత సులభమా అని ముక్కున వేలేసుకోక తప్పదు. తెలంగాణ విషయంపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి చెప్తే అయిపోతుంది కదా అని ఆ మాట అనేశారు. అసలు తెలంగాణ బంతి సోనియా కోర్టులోనే ఉందన్న విషయం అజర్‌కు తెలుసో, లేదో. సోనియా తలుచుకుంటే అది అయిపోతుంది, ఆ విషయం సోనియాకు తెలియంది కాదు.

తెలంగాణ, 14ఎఫ్‌లపై ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ మాటల్లో ఆజర్ కూడా ఓ మాట పడేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ మాట మాట కలిపారు. సాయంత్రం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడి శీలం, అజరుద్దీన్, కోమటిరెడ్డి చర్చలు సాగించారు. తెలంగాణలో భావోద్వేగాలున్నప్పటికీ, ఇప్పుడు సీమాంధ్రలో కూడా భావోద్వేగాలున్నాయని ఓ ఎంపి అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు మేడమ్, రాహుల్‌లతో మాట్లాడితే తేలిపోతుంది కదా అని అజర్ తేలిగ్గా ఓ మాట అనేశారు.

English summary
Former cricketer and Congress MP Mohammad azharuddin said that Telangana issue can be solved with appealing to Sonia and rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X