వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ప్లస్ అయిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మొత్తంగా హైకోర్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినప్పటికీ ఓ విషయంలో మాత్రం ఆయనకు ప్లస్ అయిందని అంటున్నారు. చంద్రబాబు వాదన వినకుండా ఆయన ఆస్తులపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తునకు ఆదేశించింది. వాదన వినకుండానే హైకోర్టు విచారణకు ఆదేశాలిచ్చిందన విషయం ప్రజల్లోకి విశేషంగా వెళ్లిందని, దాంతో చంద్రబాబుపై సానుభూతి పెరిగిందని అంటున్నారు. ఈ సానుభూతిని కాపాడుకోవడానికే కాకుండా మరింత సానుభూతిని పొందడానికి ఎత్తులు వేస్తున్నారట.

హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు వెళ్లకూడదనే నిర్ణయం వల్ల కూడా చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు వైయస్ జగన్‌లా కాకుండా పెద్ద మనిషిలా వ్యవహరించారనే అభిప్రాయం బలంగా ప్రజల్లోకి వెళ్తుందని అంటున్నారు. దర్యాప్తు క్రమంలో ఏయే విషయాలు వెలుగు చూస్తాయనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికిప్పుడు మాత్రం చంద్రబాబుకు కలిసి వస్తుందని అంటున్నారు.

English summary
It is said that High Court orders are fetching TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X