వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళానిధిపై రంజిత కేసు వెనక జయ

By Pratap
|
Google Oneindia TeluguNews

Ranjitha
సన్‌ నెట్‌వర్క్ చైర్మన్ కళానిధి మారన్‌పై తమిళనాడు నటి రంజిత పరువు నష్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనక ముఖ్యమంత్రి జయలలిత ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాను నిత్యానంద స్వామితో రాసలీలల్లో పాల్గొన్నట్లు తప్పుడు వీడియోను ప్రసారం చేశారని ఆరోపిస్తూ రంజిత సన్ నెట్‌వర్క్‌పై పరువు నష్టం దావా వేసింది. జయలలిత మారన్ సోదరుల అంతు చూడాలనే ఉద్దేశంతో ఉందని, అందుకే కళానిధి మారన్‌కు న్యాయపరమైన చిక్కులు కల్పిస్తున్నారని అంటున్నారు. కళానిధి సోదరుడు దయానిధి మారన్ ఇప్పటికే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కళానిధికి మరో తలనొప్పి కూడా వచ్చి పడింది. ఓ చీటింగ్ కేసులో ఆయనకు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు. తనకు ఈ నెల 26వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ఆయన అడిగారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఓ చిత్రం పంపిణీ హక్కుల విషయంలో తనను మోసం చేశారని టిఎస్ సెల్వరాజ్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కళానిధి మారన్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటికే సన్ పిక్చర్స్ సిఒఒ హన్సరాజ్ సక్సేనా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇప్పుడు కళానిధి మారన్ వంతు వచ్చినట్లే ఉంది.

English summary
The heat that Mr Maran is facing draws from the determination of Jayalalithaa to punish the Maran brothers, who have long been her political rivals. Ranjitha filed another police complaint against Sun TV alleging that the channel broadcast a defamatory video that alleged to show her in a compromising position with Swami Nithyananda of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X