వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి మెగా ఆఫర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేయడానికి అంగీకరించిన మెగా స్టార్ చిరంజీవికి ఊహించని పదవి లభిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవులు ఖాళీగా లేవు. అంత ఊహించని పదవి చిరంజీవిని ఏం వరిస్తుందనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే, రాష్ట్రంలోని ప్రస్తుత స్థితిని కదిలించకుండా, కిరణ్ కుమార్ రెడ్డికీ డి. శ్రీనివాస్‌కీ ఏ విధమైన స్థానచలనం కల్పించకుండా అద్భుతమైన పదవిని చిరంజీవి కోసం సృష్టించనున్నట్లు సమాచారం. చిరంజీవిని కాంగ్రెసు దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్తగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఆయన హవా నడుస్తుందన్న మాట. అయితే, తాజా ప్రయోజనం మాత్రం చిరంజీవి ద్వారా తమిళనాడులో పొందాలని కాంగ్రెసు అధిష్టానం ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెసుకు ప్రచారంలో చిరంజీవి ప్రధాన ఆకర్షణ అవుతారని అంటున్నారు. అలాగే, పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో కూడా చిరంజీవి ప్రచారం చేస్తారని చెబుతున్నారు.

English summary
Chiranjeevi may be appointed as co-ordinator of south India of Congress Party. Congress High Command wants Chiranjeevi to be star campaigner in ensuing Tamilnadu Assembly polls. Chiranjeevi may also campaign for Congress in Kadapa and Pulivendula bye polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X