వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సేఫ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Shobha Nagireddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి విప్‌ను ధిక్కరించారా, లేదా అనే విషయంపై అయోమయం నెలకొంది. తన పార్టీ శాసనసభ్యులకు ప్రజారాజ్యం పార్టీకి చెందిన వంగా గీత విప్ జారీ చేశారు. ఆ నోటీసు శోభా నాగిరెడ్డికి కూడా అందింది. నిబంధనల ప్రకారం శోభానాగిరెడ్డి అనర్హత కోసం ప్రజారాజ్యం పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన మిగతా శానససభ్యులంతా పార్టీ విలీనం వల్ల కాంగ్రెసులోకి వెళ్లిపోయారని చెబుతూ తనను ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలిగా గుర్తించాలని ఆమె మూడు నెలల క్రితం స్పీకర్‌కు ఓ పిటిషన్ పెట్టుకున్నారు.

విలీనం ఒప్పందంపై తాను సంతకం చేయలేదని, అందువల్ల తనను ఒకదాన్ని ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆమె స్పీకర్‌కు పెట్టుకున్న పిటిషన్‌లో అన్నారు. ఆమె విజ్ఞప్తిని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటే ఆమెపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవు. ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజారాజ్యం స్పీకర్‌కు పెట్టుకున్న పిటిషన్ కూడా పెండింగులో ఉంది. ఏమైనా, శోభా నాగిరెడ్డి సేఫ్‌గా బయటపడుతారా, అనర్హతకు గురవుతారా అనేది వేచి చూడాల్సిందే.

English summary
There is some confusion with regard to violation of whip in the case of the Allagadda Prajarajyam MLA, Ms Shobha Nagireddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X