వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమ్మె: తెరవెనక దినేష్ రెడ్డే

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Reddy
తెలంగాణ సకల జనుల సమ్మె క్రమంగా విరమణ దిశగా సాగడానికి డిజిపి దినేష్ రెడ్డి తెర వెనక చేసిన కృషే కారణమని అంటున్నారు. ఇంతకు ముందటి డిజిపిల మాదిరిగా కాకుండా పూర్తి బాధ్యతలు తీసుకుని సమ్మె నుంచి ఉద్యోగులు తప్పుకోవడం దగ్గరి నుంచి రైల్ రోకోను దెబ్బ తీసేంత వరకు ఆయన పనిచేస్తూ వెళ్లారని, దాని ఫలితం కనిపించిందని అంటున్నారు. ఆర్టీసి ఎండిగా పనిచేసినప్పుడు తనకు ఉన్న సంబంధాలతో ఆర్టీసి సంఘాలను నాయకులను చర్చలకు రప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వినికిడి. దాంతో ఆర్టీసిలో సమ్మె విరమణ సాధ్యమైందని చెబుతున్నారు.

రైల్ రోకోను అడ్డుకోవడంలో కూడా ఆయన విశేష కృషి చేశారని చెబుతున్నారు. అదనపు బలగాల కోసం రెండు సార్లు ఆయన ఢిల్లీ వెళ్లారట. ఆ అదనపు బలగాలు రాగానే రైల్ రోకో సందర్భంగా కీలక ప్రాంతాల్లో మోహరించి, మొదటి రోజు రైల్ రోకో సందర్భంగా తీసుకున్న చర్యలు రెండో రోజుకు కాస్తా పరిస్థితి మెరుగు పడడం, మూడో రోజు సమ్మెను తెలంగాణ జెఎసి విరమించుకోవడం వెనక దినేష్ రెడ్డి పట్టుదలతో కూడిన ప్రయత్నాలున్నాయని చెబుతున్నారు. తాను తగిన వివరాలు అందించి మంత్రులు సమ్మెలో ఉన్న ఉద్యోగులను చర్చలకు ఆహ్వానింపజేసి సమస్యను పరిష్కరించడంలో దినేష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అంటున్నారు.

English summary
It is said that DGP Dinesh Reddy has played a key role in thwarting Sakala Janula Samme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X