వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్ ఎంపిక, కిరణ్‌కు గుండె దడ

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
తమిళనాడు గవర్నర్‌గా వెళ్లడానికి కె. రోశయ్య ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటుకు పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెసు హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గుండె దడను పుట్టించేదనే అంటున్నారు. అత్యంత సంయమనంతో వ్యవహరించే డి. శ్రీనివాస్‌ను కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డి. శ్రీనివాస్‌కు ఈ విషయంలో అనుకూలంగా వ్యవహరించడం కూడా అందుకేనని అంటున్నారు.

తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో డిఎస్‌ను వాడుకోవడానికే కాకుండా అవసరమైతే కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో ఆయనను కూర్చోబెట్టడం కూడా సాధ్యమవుతుందనేది అధిష్టానం అంచనా అంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా డిఎస్ తెలంగాణపై అత్యంత సంయమనంతో వ్యవహరించడమే కాకుండా అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత రహస్యంగా పిసిసి అధ్యక్షుడిగా డిఎస్‌ను ఎంపిక చేసి అధిష్టానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

English summary
It is said that D Srinivas selection as MLC will be threat to CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X